పోస్టుమాస్టర్‌ దంపతుల ఆత్మహత్యాయత్నం
close

తాజా వార్తలు

Published : 16/06/2021 01:20 IST

పోస్టుమాస్టర్‌ దంపతుల ఆత్మహత్యాయత్నం

ఉంగుటూరు: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో అప్పుల బాధ భరించలేక పోస్టల్‌ ఉద్యోగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక పోస్టుమాస్టర్‌ రఘుబాబు ఇటీవల పలు ఆరోపణలపై సస్పెండ్‌ అయ్యారు.  కుటుంబ అవసరాల కోసం పలువురి నుంచి తీసుకున్న అప్పు తీర్చేందుకు గడువు కోరాడు. వెంటనే చెల్లించాలని వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 

పెద్దఅవుటుపల్లిలోని ఓ ప్రైవేటు గృహంలో రఘుబాబు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికుల సమాచారంతో బాధితులను ఆత్కూరు పోలీసులు ఆసుపత్రికి తరలించారు. విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రఘుబాబు మృతి చెందగా..అతని భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈనెలలో రఘుబాబు తిరిగి విధుల్లో చేరనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని