కరీంనగర్‌ మేయర్‌గా సునీల్‌రావు
close

తాజా వార్తలు

Updated : 29/01/2020 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరీంనగర్‌ మేయర్‌గా సునీల్‌రావు

కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా సునీల్‌రావు పేరును తెరాస అధిష్ఠానం ఖరారు చేసింది. తాజా ఎన్నికల్లో తెరాస 33 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటకు మేయర్‌ ఎన్నిక జరగనుంది. స్వతంత్రంగా గెలిచిన ఏడుగురు సభ్యులు తెరాసలో చేరడంతో కరీంనగర్‌ కార్పోరేషన్‌లో తెరాస బలం 40కి చేరింది. కరీంనగర్‌లోని 60 స్థానాలకుగాను తెరాస 33, భాజపా 13, ఎంఐఎం 7, ఇతరులు ఏడు డివిజన్లు గెలుచుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు నిన్న తెరాసలో చేరారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని