ఏపీ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
close

తాజా వార్తలు

Updated : 01/02/2021 13:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

దిల్లీ: ఎన్జీటీ ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ..పురుషోత్తపట్నం పోలవరంలో అంతర్భాగమని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. విశాఖ తాగునీటి అవసరాలను పురుషోత్తపట్నం తీరుస్తుందని ప్రభుత్వం వాదనలు వినిపించింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అన్ని అంశాలు పరిశీలించాకే ఎన్జీటీ ఆదేశాలిచ్చిందని జస్టిస్‌ నారీమన్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్జీటీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఇవీ చదవండి...

ఆదాయపన్ను చెల్లింపు దారులకు దక్కని ఊరట

20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కుకే..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని