ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
close

తాజా వార్తలు

Updated : 25/01/2021 15:03 IST

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం

పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేశారని రోహత్గి కోర్టుకు విన్నవించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. పోలీసులు వ్యాక్సిన్ భద్రతలో ఉన్నారని వివరించారు. రాష్ట్ర హైకోర్టు సింగిల్‌ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని రోహత్గి తెలిపారు. వ్యాక్సినేషన్‌ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు. దీనిపై వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది.

‘‘ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘం విధి.. ఈ వ్యవహారంపై కోర్టు జోక్యం చేసుకోవడం సబబు కాదు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా? ఏదో ఒక వంకతో ఎన్నికలు ఆపాలని చూస్తున్నారు.  ఇది రాజకీయ ప్రక్రియలో భాగం. మీ రాతలే మీ ఉద్దేశాన్ని తెలుపుతున్నాయి. మీరు ఎన్నికల కమిషనర్‌పై రాసిన విధానం మీ ఆలోచనను చూపుతున్నాయి.  చట్ట వ్యతిరేకంగా ఎన్జీవోలు వ్యవహరిస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడేమో ఎన్నికలు కావాలన్నారు. ప్రభావం తగ్గినప్పుడేమో వద్దంటున్నారు. దేశంలో రాజ్యాంగ బద్ధమైన వ్యక్తులు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని కోర్టు చెప్పాలా. ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్లడం సరికాదు’’

-ఏపీ పంచాయతీ ఎన్నికల విచారణ సందర్భంగా  జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌

ఇవీ చదవండి..
నామినేషన్‌ దాఖలుకు వచ్చిన అభ్యర్థి వెనక్కి
ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని