15 నుంచి న్యాయస్థానాల్లో భౌతిక విచారణలు
close

తాజా వార్తలు

Updated : 06/03/2021 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15 నుంచి న్యాయస్థానాల్లో భౌతిక విచారణలు

అనుమతించిన సుప్రీంకోర్టు

దిల్లీ: సుమారు ఏడాది తర్వాత న్యాయస్థానాల్లో భౌతిక విచారణలు జరిపేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. పలు న్యాయస్థానాలు, ట్రిబ్యునల్స్‌ విజ్ఞప్తి మేరకు ఈ నెల 15 నుంచి న్యాయస్థానాల్లో భౌతిక విచారణలు జరిపేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ మేరకు శనివారం ఉన్నతన్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో కోర్టు కార్యకలాపాలు నిర్వహించాలని న్యాయస్థానాలకు సూచించింది.

కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి న్యాయస్థానాల్లో వర్చువల్‌ విధానంలోనే విచారణలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైబ్రిడ్‌ (భౌతిక, వర్చువల్‌) విధానంలో కోర్టులు నిర్వహించేలా అనుమతినివ్వాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు ఉన్నతన్యాయస్థాన్ని విజ్ఞప్తి చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని భౌతిక, దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కోర్టు కార్యకలాపాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చివరి దశ విచారణలో ఉన్న కేసుల్లో మంగళ, బుధ, గురువారాల్లో పైలట్‌ ప్రాతిపదికన హైబ్రిడ్‌ విధానంలో విచారణలు చేపట్టాలని సుప్రీం సూచించింది. ఏ విధానంలో విచారణలు చేపట్టాలన్నది న్యామమూర్తులు, కోర్టు సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని ఎంచుకోవచ్చని తెలిపింది. సోమ, శుక్రవారాల్లో మాత్రం వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌ ఆధారంగా విచారణలు చేపట్టాలని సుప్రీం సూచించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని