తొలిరౌండ్‌లో తెరాస అభ్యర్థి వాణీదేవి ఆధిక్యం
close

తాజా వార్తలు

Updated : 18/03/2021 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలిరౌండ్‌లో తెరాస అభ్యర్థి వాణీదేవి ఆధిక్యం

హైదరాబాద్‌: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ  స్థానానికి సంబంధించి ఎల్బీనగర్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్డేడియంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో తెరాస అభ్యర్థి సురభి వాణీదేవికి 17,439 ఓట్లు, భాజపా అభ్యర్థి రామచంద్రరావుకు 16,385 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్‌కు 8,357 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జి.చిన్నారెడ్డికి 5,082 ఓట్లు పోలయ్యాయి.

 799 పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ పత్రాలను 8 హాళ్లలో 56 టేబుళ్ల వద్ద లెక్కిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి డి.ఎస్‌.లోకేష్‌కుమార్, రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక, ఎన్నికల పరిశీలకులు హర్‌ప్రీత్‌సింగ్‌ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ స్థానంలో  93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా...3,57,354 ఓట్లు పోలైన విషయం తెలిసిందే.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని