బహిరంగ సమావేశాలకు హాజరవ్వను: రాహుల్‌
close

తాజా వార్తలు

Published : 18/04/2021 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బహిరంగ సమావేశాలకు హాజరవ్వను: రాహుల్‌

దిల్లీ: కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో.. పశ్చిమ్‌బెంగాల్‌లోని అన్ని బహిరంగ సమావేశాలను రద్దు చేసుకున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. మిగతా పార్టీల నేతలు కూడా  సమావేశాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు చేశారు.‘‘ కరోనా విస్తృతి నేపథ్యంలో పశ్చిమ్‌బెంగాల్‌లోని అన్ని బహిరంగ సమావేశాలను రద్దు చేసుకున్నా. తాజా పరిస్థితుల గురించి రాజకీయ పార్టీల నేతలందరూ ఆలోచించాలని సూచిస్తున్నా. బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల జరిగే నష్ట తీవ్రతను అంచనా వేయాలని కోరుతున్నా’’అంటూ ఆయన ట్వీట్ చేశారు.

పశ్చిమ్‌బెంగాల్‌లో 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే 5 దశల ఎన్నికలు పూర్తవ్వగా.. మరో మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో కొవిడ్‌ ఉద్ధృతంగా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రచారంలో ఏ మాత్రం వెనకంజ వేయడం లేదు. మరోవైపు  కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఎలాంటి సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు గత శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో మూడు రోజుల ముందుగానే ప్రచారాన్ని ముగించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాకుండా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. మరోవైపు పశ్చిమ్‌బెంగాల్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,910 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,43,795 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 41,047 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అక్కడి రాష్ట్ర  ప్రభుత్వం వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని