దీదీ నామినేషన్‌పై సువేందు అభ్యంతరం 
close

తాజా వార్తలు

Published : 15/03/2021 17:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీదీ నామినేషన్‌పై సువేందు అభ్యంతరం 

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. నందిగ్రామ్‌లో తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి మధ్య పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే, ఈ నెల 10న నందిగ్రామ్‌ నుంచి దీదీ దాఖలు చేసిన నామినేషన్‌పై ప్రత్యర్థి సువేందు అభ్యంతరం వ్యక్తం చేశారు. మమతపై ఆరు క్రిమినల్‌ కేసులు ఉన్నప్పటికీ ఆమె వాటిని అఫిడవిట్‌లో పేర్కొనలేదని ఈసీకి ఫిర్యాదు చేశారు. బెంగాల్‌లో ఒక సీబీఐ కేసుతో పాటు అసోంలో ఆమెపై ఐదు క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీదీ నామినేషన్‌ను తిరస్కరించాలని ఈసీని కోరినట్టు చెప్పారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. వారేం ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూస్తామని, చట్టపరంగా చర్యలు ఉండాలన్నారు. నిబంధనలు ఎవరికైనా ఒకటేనని, తన బాధ్యతగా ఈసీకి అన్ని ఆధారాలూ సమర్పించానన్నారు. మరోవైపు, ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని