మరో ముగ్గురు ఎస్వీబీసీ ఉద్యోగులపై వేటు
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో ముగ్గురు ఎస్వీబీసీ ఉద్యోగులపై వేటు

తిరుమల: అశ్లీల చిత్రాల ఘటనలో మరో ముగ్గురు ఉద్యోగులపై శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) సస్పెన్షన్‌ వేటు వేసింది. ఎస్వీబీసీ ఎడిటర్‌ కృష్ణారావు, మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్‌లను విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. ఓ భక్తునికి అశ్లీల దృశ్యాల లింక్‌ పంపిన ఘటనలో ఇప్పటి వరకు 10 మందికి ఉద్వాసన పలికిన ఎస్వీబీసీ.. తాజాగా ఈ ముగ్గురికిపై చర్యలు తీసుకుంది. సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగుల కంప్యూటర్లలో అశ్లీల దృశ్యాలు ఉన్నట్లు తితిదే సైబర్‌ సెక్యూరిటీ విజిలెన్స్‌ విభాగం గతంలో గుర్తించింది. ఈ క్రమంలో ఎస్వీబీసీ వారిపై చర్యలు తీసుకుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని