స్వీడన్‌లో అనుమానిత ఉగ్రదాడి!
close

తాజా వార్తలు

Updated : 04/03/2021 11:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వీడన్‌లో అనుమానిత ఉగ్రదాడి!

స్టాక్‌హోం: స్వీడన్‌లోని వెట్లాండలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బీభత్సం సృష్టించాడు. వెంట తెచ్చుకున్న ఆయుధంతో పలువురిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని నిందితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జాన్‌కోపింగ్‌ కౌంటీ పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. 

‘స్టాక్‌హోం సమీపంలోని వెట్లాండ్‌లో గుర్తు తెలియని 20 ఏళ్ల వ్యక్తి పలువురిపై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కానీ, ఎవరూ మరణించలేదు. నిందితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ ప్రారంభించాం’ అని పోలీసులు తెలిపారు. కాగా, ఈ దాడిని స్వీడన్‌ ప్రధాని స్టీఫెన్‌ లోఫ్వెన్‌ తీవ్రంగా ఖండించారు. దాడికి కారకులెవరు.. దాని వెనక ఉద్దేశమేమిటి అనే విషయాలేవీ తెలియాల్సి ఉందని చెప్పారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని