బెంగాల్‌ క్షేత్రంలో స్థానిక, స్థానికేతర పోరు
close

తాజా వార్తలు

Published : 04/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగాల్‌ క్షేత్రంలో స్థానిక, స్థానికేతర పోరు

తెరపైకి జనసంఘ్‌ వ్యవస్థాపకుడి పేరు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌లో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య పోరు రసవత్తరంగా మారిన వేళ టీఎంసీ స్థానికత అస్త్రాన్ని బయటకు తీస్తోంది. భాజపా బయటి పార్టీ అని విమర్శలు గుప్పిస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కమలనాథులు భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్‌ ముఖర్జీ పేరును తెరపైకి తీసుకొచ్చి ఇక్కడివారమే అని పేర్కొంటున్నారు. అఖిల భారత హిందూ మహాసభకు అధ్యక్షుడిగా సేవలందించిన శ్యామప్రసాద్‌ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌ పార్టీనే నేడు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిందని అంటున్నారు. అలాంటప్పుడు తాము బయటివారము ఎలా అవుతామంటూ ప్రశ్నిస్తున్నారు.

ఆధునిక భారతం నుంచి హిందూ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారందరూ బెంగాల్‌ నుంచే వచ్చారని భాజపా ఎంపీ స్వపన్‌దాస్‌ గుప్తా పేర్కొంటున్నారు. కాగా శ్యామప్రసాద్‌ ముఖర్జీ వారసత్వాన్ని భాజపా నేతలు పునికిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కుటుంబసభ్యులు తప్పుపట్టకపోయినప్పటికీ.. ముఖర్జీ కాలం నాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో పోల్చి చూసి మాట్లాడుతున్నారు. ముఖర్జీని బెంగాల్‌ సర్కారు ఇన్నేళ్లుగా పట్టించుకోలేదని ఆక్షేపిస్తున్నారు. స్థానికులు-బయటివారు అన్న వాదన వినిపిస్తున్నప్పటి నుంచి ఒక్కసారిగా శ్యామప్రసాద్‌ వారసత్వాన్ని సొంతం చేసుకునేందుకు టీఎంసీ సహా ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని