రసవత్తరంగా తాడిపత్రి ఛైర్మన్‌ ఎన్నిక
close

తాజా వార్తలు

Published : 15/03/2021 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రసవత్తరంగా తాడిపత్రి ఛైర్మన్‌ ఎన్నిక

ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో ఓట్ల తిరస్కరణ

తాడిపత్రి: తాడిపత్రి పురపాలిక ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యులు కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో పురపాలిక చైర్మన్‌ ఎన్నిక రసవత్తరంగా కనిపిస్తోంది. ఇక్కడ ఎక్స్‌అఫీషియో ఓటు కోసం తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డితో పాటు ముగ్గురు వైకాపా ఎమ్మెల్సీలు పెట్టుకున్న దరఖాస్తును మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌రెడ్డి తిరస్కరించారు. ఎమ్మెల్సీలు గోపాల్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, ఇక్బాల్ అహ్మద్‌, శమంతకమణికి ఎక్స్‌అఫీషియో ఓటు అర్హత లేదని కమిషనర్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలకు మాత్రమే ఎక్స్‌అఫీషియో ఓటు అర్హత ఉంటుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి రాయదుర్గంలో ఓటు హక్కుతో ఎమ్మెల్సీ అయ్యారని కమిషనర్‌ వివరించారు. 

తాడిపత్రి పురపాలికలోని 36 వార్డుల్లో రెండు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. తెదేపా 18, వైకాపా 14, సీపీఐ, స్వతంత్రులు తలొకటి గెలుచుకున్నారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు తెదేపాకు అనుకూలంగా ఉన్నారు. వైకాపాకు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీబలం 18కి చేరుతుంది. తెదేపా తరఫున ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో తెదేపా సొంతబలం 19 అవుతుందని భావించారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌ దీపక్‌ రెడ్డి ఓటును తిరస్కరించారు. ఫలితాలు వెలువడ్డాక తెదేపాకు చెందిన 18 మందితోపాటు సీపీఐ, స్వతంత్రులనూ జేసీ పవన్‌రెడ్డి ప్రత్యేక శిబిరానికి తరలించిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని