అప్పుడే ప్రేక్షకులు అభిమానిస్తారు
close

తాజా వార్తలు

Updated : 15/09/2020 20:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడే ప్రేక్షకులు అభిమానిస్తారు

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలోని పలువురి ప్రోత్సాహం వల్ల తన ‘బ్లాక్‌ బోర్డ్‌’ చిత్రం థియేటర్‌లలో విడుదల చేయగలిగానని అన్నారు యువ కథానాయకుడు తల్లాడ సాయికృష్ణ. మంగళవారం తెలుగు చలనచిత్ర దినోత్సవం సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు కాలక్షేపం కోసం.. వినోదం కోసం మంచి సినిమాలు కావాలని కోరుకుంటారు. అలాంటి సినిమాలను తీసుకొచ్చినప్పుడు వాళ్లు మనల్ని ఎంతో అభిమానిస్తారని అన్నారు.

ఒకప్పుడు సినిమా వాళ్లంటే సామాన్య ప్రజల్లో ఒక విధమైన ఆలోచన ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. తనికెళ్ల భరణి, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కిషోర్ దాస్‌లాంటి వాళ్లు తనని ఎంతో ప్రోత్సహించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల ఆధారంగా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు సాయి కృష్ణ పేర్కొన్నారు. అదే విధంగా జానీ దర్శకత్వంలో ఓ హారర్‌ చిత్రంలోనూ నటిస్తున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని