నిబంధనలు పాటిస్తేనే బయటపడతాం: తమిళిసై
close

తాజా వార్తలు

Published : 08/05/2021 19:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిబంధనలు పాటిస్తేనే బయటపడతాం: తమిళిసై

హైదరాబాద్: నిబంధనలు పాటిస్తేనే కరోనా సంక్షోభం నుంచి బయటపడవచ్చని, ప్రజల భాగస్వామ్యంతోనే వైరస్‌ ప్రబలకుండా చూడగలమని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం సందర్భంగా ఆ సొసైటీ ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులతో పుదుచ్చేరి నుంచి వర్చువల్‌గా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులను తట్టుకునేందుకు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చైతన్యం చేయడం కీలకమన్నారు. ప్రజల్ని చైతన్య పరిచే దిశగా రెడ్‌క్రాస్‌ సొసైటీ కృషి చేయాలని కోరారు.‘‘ కరోనా సంక్షోభం వేళ రెడ్‌క్రాస్‌ వాలంటీర్ల సేవ అపూర్వం. మరిన్ని సేవా కార్యక్రమాలతో బాధితులకు అండగా నిలవాలి’’ అని తమిళిసై ఆకాంక్షించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని