కేసీఆర్‌ది తానీషా తరహా పాలన: తరుణ్‌చుగ్‌
close

తాజా వార్తలు

Updated : 07/04/2021 11:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేసీఆర్‌ది తానీషా తరహా పాలన: తరుణ్‌చుగ్‌

హాలియా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన పరిపాలనతో తానీషాను తలపించేలా తయారయ్యారని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌చుగ్‌ విమర్శించారు. కేసీఆర్ సర్కార్‌ అన్ని వ్యవస్థలను తిరోగమన దిశలోకి తీసుకెళ్తోందని ఆరోపించారు. ప్రకృతి వనరులతో అలరారుతున్న నాగార్జునసాగర్‌కు తెరాస, కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఆ రెండు పార్టీల పాలనపై ‘ఛార్జ్‌షీట్‌’ విడుదల చేశారు. ఏడు పర్యాయాలు శాసనసభ్యుడిగా.. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా నియోజకవర్గానికి జానారెడ్డి చేసిందేమీలేదని ఆరోపించారు.

‘‘మీరు చేసిన పనులకు ఛార్జ్‌షీట్‌ ఒక ట్రైలర్‌ మాత్రమే. సినిమా మొత్తం చూస్తే వీరి పాపాల వల్ల బత్తాయికి మద్దతు ధర లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలుస్తుంది. బత్తాయి జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని కేసీఆర్‌, జానారెడ్డిని అడుగుతున్నాం. జ్యూస్‌ ఫ్యాక్టరీ ఎప్పుడు వస్తుందని స్థానిక ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు’’ అని తరుణ్‌చుగ్‌ అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని