కూలీకి రూ.43 లక్షల పన్ను ఎగవేత నోటీసులు

తాజా వార్తలు

Published : 21/02/2021 11:18 IST

కూలీకి రూ.43 లక్షల పన్ను ఎగవేత నోటీసులు

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ మారుమూల తండాలో కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వ్యక్తికి వస్తు,సేవల పన్ను(జీఎస్‌టీ) అధికారులు నోటీసులు పంపించారు. ఆయన్ను రూ.24 కోట్లు విలువ చేసే డైమండ్‌ కంపెనీకి యజమానిగా పేర్కొనడంతో పాటు రూ.43 లక్షలు తక్షణమే చెల్లించాలని అందులో కోరారు. రాజస్థాన్‌లోని డూంగర్‌పుర్‌లోని పాలీ గ్రామానికి చెందిన నానారామ్‌ కూలీ పనులు చేసుకొని కాలం వెళ్లదీస్తున్నాడు. నిలువు నీడ కూడా లేని నాకు జీఎస్‌టీ అధికారులు నోటీసులు జారీ చేయడం ఏమిటని నానారామ్‌ వాపోతున్నాడు. గ్రామాల్లో జరిగే ఉపాధి హామీ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి తన విలువైన పత్రాలను నానారామ్‌ అధికారులకు సమర్పించాడు. అయితే అవి చోరీకి గురయ్యాయి. వాటితో గుర్తు తెలియని వ్యక్తులు ఖాతా తెరిచి వ్యవహారం నడిపిస్తున్నారు. బోగస్‌ బిల్లులతో పన్ను ఎగవేతకు ప్రయత్నించారు. పత్రాల్లో ఉండే చిరునామా ప్రకారం అధికారులు నోటీసులు పంపించడంతో అసలు విషయం బయట పడింది. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని