టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనం
close

తాజా వార్తలు

Updated : 07/04/2021 20:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనం

హైదరాబాద్‌: తెలంగాణలో తెదేపాకు మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధికార తెరాసలో చేరారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గులాబీ పార్టీకి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెరాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో రాష్ట్రంలో తెదేపాకు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలూ తెరాసలో చేరినట్లయింది. అనంతరం తెదేపా శాసనసభాపక్షాన్ని తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేశారు. దీనికి సంబంధించిన లేఖను శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు అందజేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని