
తాజా వార్తలు
జగన్ రోజుకో వేషంతో మోసం: అచ్చెన్న
తిరుపతిలో పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం
తిరుపతి: రోజుకో వేషంతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులకు సంబంధించి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గ్రహించి ఆలయాలకు శంకుస్థానలు, గోపూజలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లౌకికవాదమే తెలుగుదేశం మూల సిద్ధాంతమని.. అయితే ఇటీవల కొన్ని వర్గాలు తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.
లోక్సభ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తిరుపతిలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని అచ్చెన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందుతోందన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో తిరుపతి లోక్సభ పరిధిలోని తెదేపా నేతలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..
400వ రోజు కదం తొక్కిన రాజధాని రైతులు
గొల్లపూడిలో దేవినేని ఉమా దీక్ష