ఓటమి భయంతోనే వైకాపా దాడులు: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 10/03/2021 17:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటమి భయంతోనే వైకాపా దాడులు: చంద్రబాబు

అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా దాడులకు తెగబడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా సానుభూతిపరులపై దాడులు చేయడం హేయం అని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైకాపా నేతల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 

దాడులు, దౌర్జన్యాలతో వైకాపా నేతలు ఓటర్లను భయపెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. విశాఖలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ అరెస్ట్‌ను ఆయన ఖండించారు. వైకాపా నేతల దాడులకు పోలీసులు అండగా నిలబడటం దారుణమన్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని