రివర్స్‌గేర్‌లో రాష్ట్రాభివృద్ధి: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 30/03/2021 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రివర్స్‌గేర్‌లో రాష్ట్రాభివృద్ధి: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రాభివృద్ధి రివర్స్‌గేర్‌లో ప్రయాణిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపై రూ.రెండున్నర లక్షల భారం మోపిందని ఆరోపించారు. తెదేపా ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు మాట్లాడారు. 

‘‘వైకాపా ప్రభుత్వం 20 నెలల్లో రూ.1.70లక్షల కోట్ల అప్పు చేసింది. ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేశారు. ఆదాయానికి మించి అప్పులు చేయడం దివాళా కాకపోతే మరేంటి? చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో రూ.70వేల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి. సామాన్య ప్రజలు బతకలేని విధంగా అన్ని ధరలు పెంచేశారు. ప్రత్యేకహోదా ఎందుకు సాధించలేకపోయారు? 28 మంది వైకాపా ఎంపీలు కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలి. రెండేళ్లలో ఉద్యోగాలు వచ్చే ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా? కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమను తాకట్టు పెట్టారు. నాసిరకం మద్యం ద్వారా రూ.వేల కోట్లు దండుకుంటున్నారు. అసెంబ్లీ పెట్టి కనీసం బడ్జెట్‌ను కూడా ఆమోదింపజేసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇచ్చేది గోరంత.. దోచేది కొండంత. యువత మేలుకుని భవిష్యత్తు గురించి బాధ్యతతో ఆలోచించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని