కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 18/02/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది: చంద్రబాబు

అమరావతి: కుప్పంలో తాము గెలవకపోవడం కాదని.. ప్రజాస్వామ్యం ఓడిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. డబ్బు పంపిణీతో పాటు అరాచకాలపై ఆధారాలు పంపినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని మండిపడ్డారు. అక్రమాలు అడ్డుకోలేని ఎన్నికల కమిషన్‌ ఎందుకని ప్రశ్నించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులు తమతో మైండ్‌ గేమ్‌ ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైకాపాకు ఓటేయని వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ శాతం తెదేపా మద్దతుదారులే గెలిచారన్నారు. 

‘కుప్పంలో కోట్ల రూపాయల డబ్బులు పంచారు. కుప్పంతో నాకు 35 ఏళ్ల అనుబంధం ఉంది. అక్కడి ప్రజలు నన్ను కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. శాంతికి మారుపేరు కుప్పం. అలాంటి శాంతియుత ప్రాంతాన్ని కలుషితం చేస్తారా?కుప్పాన్ని మరో పులివెందులగా మారుస్తారా?’అని చంద్రబాబు ప్రశ్నించారు. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని