
తాజా వార్తలు
రైతు వెంకటయ్యకు అండగా ఉందాం: చంద్రబాబు
హైదరాబాద్: జగన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు పెరుగుతున్నాయని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లా వెంకన్నపాలెంకు చెందిన వెంకటయ్య అనే రైతుపై జరిగిన దాడి గురించి చంద్రబాబు స్పందించారు. వెంకటయ్యకు అండగా నిలబడతాం... శిక్షపడేవారకు తప్పు చేసిన అధికారులను వదలం అంటూ చంద్రబాబు ట్వీట్లు చేశారు.
‘‘హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా నెల్లూరు వెంకటయ్యను వేధించారు. అధికారుల వేధింపుల వల్లే రైతు పురుగుల మందు తాగారు. కానిస్టేబుళ్లు మాటలతో వేధించి, శారీరకంగా దాడి చేశారు. కోర్టుకు వెళ్లిన రైతుపై అధికారులు ప్రతీకారం తీర్చుకోవడం దుర్మార్గం. హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి శారీరక, మానసిక హింసకు గురి చేశారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Tags :