
తాజా వార్తలు
‘వైకాపా’ జేబులు ఫుల్.. పేదల ఆనందం నిల్
తెదేపా అధినేత చంద్రబాబు
అమరావతి: గృహనిర్మాణ శాఖలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదల ఇళ్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు స్పందించారు. ‘‘తెదేపా హయాంలో ఇళ్ల నిర్మాణం ‘పేదల పండుగ’ గా జరిగింది. 13 నెలలుగా వైకాపా నేతల జేబులు ఫుల్, పేదల కుటుంబాల్లో ఆనందం నిల్‌గా ఉంది. తెదేపా ఆందోళనతోనైనా వైకాపా ప్రభుత్వం కళ్లు తెరవాలి. మా హయాంలో పూర్తయిన ఇళ్లను వెంటనే పేదలకు అందించాలి’’అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Tags :