విశాఖ ఉక్కును తాకట్టు పెట్టారు: ఉమా
close

తాజా వార్తలు

Updated : 07/02/2021 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాఖ ఉక్కును తాకట్టు పెట్టారు: ఉమా

అమరావతి: వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోందని తెదేపా నేత దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ఉద్యోగులను, ఎస్‌ఈసీని బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీలో మోదీ, అమిత్‌షాతో జరిగిన భేటీలో సీఎం జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఆ సమావేశాల వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ‘వైకాపా బలపరిచిన అభ్యర్థులకు ఓటెందుకు వేయాలి. అమరావతి ఉద్యమంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. విశాఖను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం కార్పొరేట్‌ సంస్థలతో చర్చలు జరుపుతుంటే వైకాపా ఎంపీలు ఏం చేస్తున్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు రూ.3వేల కోట్ల బకాయిలున్నాయి. రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్న మంత్రులను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని దేవినేని ఉమా అన్నారు. 

 

ఇవీ చదవండి..
‘అధికారులను బెదిరించడం రాజ్యాంగ ఉల్లంఘనే’

ఎస్‌ఈసీ ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని