‘విశాఖ రిజిస్ట్రేషన్లపై విచారణకు సిద్ధమా?’
close

తాజా వార్తలు

Published : 26/03/2021 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘విశాఖ రిజిస్ట్రేషన్లపై విచారణకు సిద్ధమా?’

వైకాపాకు తెదేపా నేత ధూళిపాళ్ల సవాల్‌

అమరావతి: రాజధానికి అసైన్డ్‌ భూమి ఇచ్చిన ఎస్సీ రైతులకు మిగిలిన వారితో పోలిస్తే ప్లాట్ల సైజు పెంచి ఇవ్వడం తప్పా?అది దళితులకు ద్రోహం చేసినట్టా? అని తెదేపా ప్రశ్నించింది. అవాస్తవాన్ని పదేపదే ప్రచారం చేయడం ద్వారా వాస్తవాన్ని కనుమరుగు చేయాలని వైకాపా భావిస్తోందని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

సీఆర్‌డీఏ చట్టం వచ్చాక అందర్నీ సంప్రదించాకే అప్పటి ప్రభుత్వం జీవో 41 ఇచ్చిందన్నారు. ఈ జీవో ద్వారా అసైన్డ్‌ భూములన్న వారికి మరింత లబ్ధి జరిగిందనేది కళ్లముందున్న వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. ఎస్సీ రైతుల మేలు కోసం పోరాడుతున్నట్లు వైకాపా నాటకాలాడుతోందని దుయ్యబట్టారు. ఎవర్ని మభ్యపెట్టేందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. కార్యనిర్వాహక రాజధాని ప్రకటన తర్వాత విశాఖలో జరిగిన వేలాది రిజిస్ట్రేషన్లను బహిరంగపరిచే సత్తా ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. దీనిపై న్యాయ విచారణకు సిద్ధమా? అని ధూళిపాళ్ల సవాల్ విసిరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని