close

తాజా వార్తలు

Updated : 20/01/2021 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నల్లపురెడ్డి మాటలు వినిపించలేదా?: జేసీ

పోలీసు సంక్షేమ సంఘంపై మండిపడిన తెదేపా నేత

అనంతపురం: నెల్లూరు జిల్లా ఎస్పీని వైకాపాకు చెందిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తిడితే పోలీసు సంక్షేమ సంఘం ఏం చేస్తోందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. పోలీసు సంక్షేమ సంఘానికి పక్షపాతం ఎందుకని నిలదీశారు. అనంతపురం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటూ పోలీసుల పరువు తీయొద్దని సంఘాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనపై అకారణంగా ఫిర్యాదు చేసిన సంఘానికి నల్లపురెడ్డి మాటలు వినిపించలేదా? అని ప్రశ్నించారు. తనపై ఒకలా.. నల్లపురెడ్డిపై మరొకలా ఎందుకని ప్రశ్నించారు. ఎందుకంత వ్యత్యాసం చూపిస్తున్నారని నిలదీశారు.

ఇవీ చదవండి..

‘ప్రత్యేకహోదాను వైకాపా తాకట్టు పెట్టింది’

జగన్‌ రోజుకో వేషంతో మోసం: అచ్చెన్న



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని