వైకాపా రైతుల రుణమాఫీ ఎగ్గొట్టింది: తెదేపా
close

తాజా వార్తలు

Updated : 07/02/2021 10:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపా రైతుల రుణమాఫీ ఎగ్గొట్టింది: తెదేపా

అమరావతి: వైకాపా ప్రభుత్వం 4, 5 విడతల రుణమాఫీ సొమ్ము ఎగ్గొట్టి రైతులకు అన్యాయం చేసిందని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ప్రజలు ఆ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలో వైకాపా చెప్పగలదా అని ప్రశ్నించారు. రూ.2 వేల కోట్ల బకాయిలు రైతులపై మోపినందుకు ఓటేయాలా అని నిలదీశారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు అమర్చే వైకాపాకు ఓటేందుకు వెయ్యాలని ప్రశ్నించారు. ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. 

పన్నులు, అప్పులు పెంచడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపై వైకాపా ప్రభుత్వం రూ. 2 లక్షల భారం మోపిందని కళా వెంకట్రావు విమర్శించారు. ఏటా జనవరిలో విడుదల చేస్తామన్న ఉద్యోగాల క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. తెదేపా హయాంలో తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేసి రూ.4 వేల కోట్లు వృథా చేశారని ఆరోపించారు. సెంటు పట్టా భూముల పంపిణీల పేరుతో రూ.6,500కోట్ల అవినీతికి పాల్పడినందుకు వైకాపాకు ఓటెయ్యాలా అని ప్రశ్నించారు. 34 శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను 24కి తగ్గించి బీసీలకు దక్కాల్సిన 16 వేల పదవులకు గండి కొట్టారని కళా వెంకట్రావు మండిపడ్డారు. 
ఇవీ చదవండి..

మళ్లీ చెబుతున్నా.. రేపూ ఇదే చెప్తా

ఎంత మంచోడినో.. అంత దుర్మార్గుడిని!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని