close

తాజా వార్తలు

Published : 29/01/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జనగామలో తెదేపా నేత దారుణ హత్య

జనగామ టౌన్‌: తెదేపా నేత, మాజీ కౌన్సిలర్‌ పులి స్వామి(53) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని హతమార్చారు. జనగామ ఏసీపీ వినోద్ కుమార్ కథనం ప్రకారం.. పులిస్వామి ఉదయం తన నివాసం నుంచి మార్నింగ్ వాక్ కోసం హన్మకొండ రోడ్డు వైపు వెళుతుండగా స్థానిక సోషల్ వెల్ఫేర్ హైస్కూల్ సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెంబడించారు. ఒక్కసారిగా ఆయనపై దాడి చేసి మారణాయుధాలతో మెడపై నరికి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పులిస్వామి అక్కడికక్కడే మృతి చెందారు. 

విషయం తెలుసుకున్న వెంటనే ఏసీపీ వినోద్ కుమార్‌, పట్టణ సీఐ మల్లేశ్‌ ఘటనాస్థలికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. భూ తగాదాలతోనే పులిస్వామి హత్య జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిందితులను పట్టుకునేందుకు తమ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని ఏసీపీ తెలిపారు. త్వరలోనే ఈ హత్య కేసును ఛేదిస్తామని ఆయన చెప్పారు.

ఇవీ చదవండి..

7.5శాతం ఫిట్‌మెంట్‌ సమ్మతం కాదు: పీఆర్టీయూ

అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని