
తాజా వార్తలు
అవినీతిని ఎండగడితే హత్య చేయిస్తారా.?:లోకేశ్
ఇంటర్నెట్ డెస్క్ : ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్న పాపం సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఊరికే వదలదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. జగన్ తన ఫ్యాక్షన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కడప జిల్లాలో చేనేత వర్గానికి చెందిన నాయకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారని మండిపడ్డారు. ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై సీఎం జగన్ అహాన్ని అణచివేస్తామని స్పష్టం చేశారు. వైకాపా అవినీతిని ఎండగట్టినందుకు కక్ష గట్టి తెదేపా జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారని ఆరోపించారు. పరిహారాలతో బాధిత పిల్లలకు తండ్రిని తీసుకురాగలరా అని ప్రశ్నించారు.? హత్య చేయించిన ఎమ్మెల్యే, అతని బావమరిది బంగారురెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం నుంచి ఆయన ఇంటివద్ద రెక్కీ చేసిన దుండగులు.. ప్రణాళిక ప్రకారం బయటకు రప్పించి కిరాతకంగా హత్య చేశారు. పేదలకు పంపిణీ కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలున్న ప్రదేశం వద్ద సుబ్బయ్యను చుట్టుముట్టి, కళ్లలో కారం కొట్టి.. వేటకొడవళ్లతో తల నరికేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..
తెదేపా నేత హత్య
దేశంలో మరో 14 కొత్తరకం కరోనా కేసులు