close

తాజా వార్తలు

Published : 25/01/2021 13:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాడుగ నేతలతోనే ఎన్నికలకు ఆటంకం: పట్టాభి

అమరావతి: క్షేత్రస్థాయిలో చాలా మంది ఉద్యోగులు రాజ్యాంగానికి లోబడి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ అన్నారు. కొందరు బాడుగ నేతలు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్‌ వైపు ఉన్నారని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. 20 నెలల్లో ఒక్క జీఎల్‌ఐ క్లైయిమ్‌ అయినా పరిష్కారమైందా అని ప్రశ్నించారు. జగన్‌ సీఎం అయ్యాక ఏ ఉద్యోగికీ జీపీఎఫ్‌ నిధులు సక్రమంగా అందటం లేదని మండిపడ్డారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల పక్షాన తెదేపా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. 

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని జగన్ ఇచ్చిన హామీకి తిలోదకాలు వదిలారని పట్టాభిరామ్‌ ఆరోపించారు. 30 నెలలైనా పీఆర్సీ అమలు కాకపోవడం తదితరాలపై మాట్లాడని ఉద్యోగ సంఘ నాయకులు ఎన్నికలపై మాట్లాడుతున్నారన్నారు. ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని ప్రతి నాయకుడు బాడుగ నాయకుడే అని పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు.  

ఇవీ చదవండి..
‘జగన్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు’

నామినేషన్‌ దాఖలుకు వచ్చిన అభ్యర్థి వెనక్కి 



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని