ప్రాణాలొడ్డి సేవలందిస్తే..లాఠీఛార్జి చేస్తారా? 
close

తాజా వార్తలు

Updated : 27/03/2021 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణాలొడ్డి సేవలందిస్తే..లాఠీఛార్జి చేస్తారా? 

అమరావతి: ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కరోనా వారియర్స్‌ విషయంలో వైకాపా ప్రభుత్వ తీరు అభ్యంతరకరంగా ఉందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆక్షేపించారు. వారియర్స్‌కు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోగా .. విధుల్లోంచి తొలగించడం దారుణమన్నారు. ఇదేనా వారికి జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చే  గౌవరమని మండిపడ్డారు. కరోనా రెండో దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వీడట్లేదని విమర్శించారు.  గుంటూరులో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌పై లాఠీఛార్జి చేయడం దుర్మార్గమన్న పట్టాభి... తక్షణమే వారియర్స్‌కు పెండింగ్‌ వేతనాలు చెల్లించి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనా వారియర్స్‌ను విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని