మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి:తెదేపా
close

తాజా వార్తలు

Updated : 06/02/2021 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి:తెదేపా

అమరావతి: ఉద్యోగులను బెదిరించేలా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లిన తెదేపా బృందం గవర్నర్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ ‘రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఓ మంత్రి ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామనడం దారుణం. తాము అధికారంలో ఉన్నంత కాలం బ్లాక్‌ లిస్టులో పెడతామనడం అన్యాయం. రాజ్యంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థ మాటలను వినొద్దని మంత్రి చెప్పడంపై గవర్నర్‌ స్పందించాలి. ఆ మంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రహస్య పరిపాలన చేస్తున్నారు. కలెక్టర్లు, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఎస్‌ఈసీ మాట వినడానికి వీల్లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఈ మాటలు అనలేదని కప్పి పుచ్చుకోడానికి వీల్లేదు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజిలను, పత్రికల్లో వచ్చిన వార్తలను గవర్నర్‌ కార్యాలయంలో అందజేశాం’ అని  తెలిపారు.  

‘ఏ అధికారి అయినా ఎస్‌ఈసీ మాటలు వింటాం.. ఆయన చెప్పినట్లు చర్యలు తీసుకుంటాం అని అనుకుంటే గుణపాఠం తప్పదు. అందరినీ గుర్తు పెట్టుకుంటాం. చిత్తూరు, గుంటూరులో ఏకగ్రీవాలను ఆపమని ఆయన(నిమ్మగడ్డ) అంటున్నారు. మీరు ఆయన మాట వినకుండా ఏకగ్రీవంగా గెలిచిన వారందరికీ డిక్లరేషన్లు అందజేయాలని సూచిస్తున్నా. ఇవ్వకపోతే... పేరు పేరునా గుర్తు పెట్టుకొని ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా’ అని శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. 

ఇవీ చదవండి..
ఎస్‌ఈసీ మాట వింటే బ్లాక్‌ లిస్టులో పెడతాం జాగ్రత్త!

తితిదేకి బోర్డు సభ్యుడు భారీ విరాళం
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని