close

తాజా వార్తలు

Published : 03/01/2021 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో అప్పులు అత్యధికం..అభివృద్ధి అత్యల్పం

తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు అత్యధికం.. అభివృద్ధి అత్యల్పమని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అప్పుల భారం ప్రజలకు.. పప్పూ బెల్లాలు వైకాపా నాయకులకని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫిజికల్‌, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఉద్యోగులకు టీఏ, డీఏలు.. రిటైర్డ్‌ ఉద్యోగులకు పింఛన్లు సకాలంలో ఇవ్వడం లేదన్నారు. రెవెన్యూ లోటు రూ.1,10,320 కోట్లకు చేరుతోందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో లక్షన్నర కోట్ల రూపాయలు అప్పులు చేశారని, ప్రజలపై రూ.75 వేల కోట్ల పన్నులు వేశారని మండిపడ్డారు. 

గత ఏడాది తొలి ఆరు నెలల్లో రెవెన్యూ వసూళ్లు 6 శాతం పెరిగాయని, అప్పులు గతం కన్నా రెట్టింపు అయ్యాయని పేర్కొన్నారు. గతంలో కంటే 23 శాతం అదనంగా ఖర్చు చేశారన్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయం రూ.7,700కోట్లు అదనంగా అందిందని.. ఈ నిధులు ఎక్కడికి పోయాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మార్కెట్లో నిత్యావసరాల ధరలకు, చేసే సంక్షేమానికి పొంతన లేదని విమర్శించారు. సీఎం జగన్‌ అవినీతి, చేతగాని పాలనతో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక స్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు, ఎడాపెడా పన్నులు వేసి ‘గవర్నమెంట్‌ టెర్రరిజం’తో ఏపీకి చెడ్డపేరు తీసుకొచ్చారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధఃపాతాళానికి దిగజార్చారని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై దాడులు, ప్రజలపై దౌర్జన్యాలు, ఆలయాల ధ్వంసంతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను నేరగాళ్లకు స్వర్గధామంగా మార్చారని వైకాపా ప్రభుత్వంపై యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. 

ఇవీ చదవండి..
దాడుల వెనుక ప్రతిపక్షం హస్తం: చెల్లుబోయిన

ఏపీలో పోలీసుశాఖ అప్రమత్తం



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని