close
Array ( ) 1

తాజా వార్తలు

ఆ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరు: యనమల

అమరావతి: శాసనమండలి ఛైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు నిర్ణయం ఎవరూ ప్రశ్నించలేనిదని, అలా చేస్తే పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. సెలెక్ట్‌ కమిటీకి బిల్లులు వెళ్లినప్పుడు అనేక మార్లు మూజువాణి లేదా ఓటింగ్‌ లేకుండానే నిర్ణయం తీసుకున్నవేనని గుర్తుచేశారు. ఇలాంటివి మెజారిటీ సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా సభ మూడ్‌ని బట్టే జరుగుతాయన్నారు.

సభలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా రూలింగ్‌ ఇచ్చే అధికారం ఛైర్మన్‌కి ఉందని యనమల అన్నారు. న్యాయస్థానం తీర్పును ఎవరూ ప్రశ్నించరాదని చట్టంలోని 212 నిబంధన స్పష్టం చేస్తుందని, ఒక కార్యదర్శి... మండలి ఛైర్మన్‌ నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారని నిలదీశారు. శాసనమండలి నిబంధనలన్నీ పార్లమెంట్‌ వ్యవహారాలకు అనుబంధంగా రూపొందించినవేనన్నారు. మండలి ఛైర్మన్‌ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకునే సర్వ అధికారాలు ఛైర్మన్‌కు ఉన్నాయని, ఛైర్మన్‌ రూలింగ్ నిర్ణయమే తప్ప మరొకటి కాదని యనమల స్పష్టం చేశారు.  

కార్యదర్శిని వెనకేసుకొచ్చే వైకాపా నేతలు ఒక విషయం గ్రహించాలన్న యనమల...సభలో కార్యదర్శి నిర్ణయం అంతిమమా? లేక ఛైర్మన్‌ నిర్ణయమో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇవాళ మండలిలో జరిగింది రేపు శాసనసభలోనూ జరగొచ్చన్నారు. ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమన్నారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం నాయకులకు భద్రత కుదింపు అప్రజాస్వామికమన్నారు.అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరించటం తగదని హితవు పలికారు. దీనిపై శాసనమండలిలో చర్చించి సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి పంపుతామని యనమల తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.