close

తాజా వార్తలు

Updated : 16/02/2020 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘రూ.2లక్షలను 2వేల కోట్లని ప్రచారం చేస్తారా?’ 

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ నివాసంలో జరిగిన సోదాలకు సంబంధించి ఐటీ శాఖ విడుదల చేసిన పంచనామా రిపోర్టుపై తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ఐటీ శాఖ దాడుల్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైకాపా నేతలు దుష్ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదురోజులు ఐటీ దాడులని సొంత మీడియాలో బూతద్దంలో చూపారని, రూ.2లక్షల నగదుకు 2 వేల కోట్లని ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 డొల్ల కంపెనీలు ఉన్నాయని వైకాపా దుష్ప్రచారం అబద్ధాలకు పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. పంచనామా రిపోర్ట్‌పై వైకాపా నేతలు స్పందించాలని డిమాండ్‌ చేశారు.

తప్పుడు ప్రచారం చేసినందుకు వైకాపా నేతలు.. తెదేపా, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దుష్ప్రచారం చేసిన వైకాపా నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సాక్షి మీడియా దుష్ప్రచారం అంతా అబద్ధమేనని తూర్పారబట్టారు. వైకాపా నేతలు, సాక్షి మీడియాపై పరువునష్టం దావా వేస్తామన్నారు. ప్రెస్‌ కౌన్సిల్‌, ఎడిటర్స్‌ గిల్ట్‌కు ఫిర్యాదులు చేస్తామని, వైకాపా నేతలు, సాక్షి మీడియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైకాపా పార్టీ పేరు .. అబద్ధాల కాంగ్రెస్‌గా మార్చుకోవాలని యనమల సూచించారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన