close

తాజా వార్తలు

Updated : 05/04/2020 12:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాక్‌డౌన్‌ సాయం దుర్వినియోగం: తెదేపా 

అమరావతి: లాక్‌డౌన్‌ వేళ సాయం కోసం అందించే వెయ్యి రూపాయల నగదు, నిత్యావసరాలను వైకాపా నేతలు దుర్వినియోగం చేస్తున్నారని తెదేపా శాసనసభాపక్షం.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాసింది. రాజకీయ లబ్ధి పొందుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం ఈ పంపిణీ చేపడుతున్నారని  మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, టీడీఎల్పీ ఉప నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలు భౌతిక దూరం పాటించకుండా సమూహంగా వెళ్లి కరోనా వ్యాప్తి చెందేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు పంపిణీ చేయాల్సిన సాయాన్ని వైకాపా నాయకులు పంచుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన అధికార పార్టీ అభ్యర్థులు దీనిని ప్రచారంలా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని  తెదేపా నేతలు లేఖ ద్వారా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని