close

తాజా వార్తలు

Published : 23/05/2020 11:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట తెదేపా నేతల ధర్నా

ఉయ్యూరు: కృష్ణా జిల్లా ఉయ్యూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారనే  ఆరోపణపై తెదేపా కార్యకర్త రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైకాపా నేతల ఒత్తిడి మేరకు పోలీసులు తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ తెదేపా శ్రేణులతో కలిసి శనివారం ఉదయం ఉయ్యూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. 

వైకాపా నేతలు మద్యం బాటిళ్లను రాంబాబు నివాసంలో పెట్టి పోలీసులతో దాడి చేయించారని ఆరోపించారు. అక్రమ కేసులు రద్దు చేసి, వెంటనే రాంబాబును విడుదల చేయాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ హెచ్చరించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన