కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు
close

తాజా వార్తలు

Published : 14/04/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు

దిల్లీ: తిరుపతి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు చేసింది. దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను తెదేపా ఎంపీలు కలిశారు. సోమవారం తిరుపతిలో తెదేపా నిర్వహించిన సభలో జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌ వినతిపత్రం అందజేశారు. తిరుపతి ఉపఎన్నికలో కేంద్ర బలగాల పర్యవేక్షణలో పోలింగ్‌ నిర్వహించాలని ఎంపీలు కోరారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2లక్షల నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని.. రెండు అదనపు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంలోని వాలంటీర్లను భాగస్వాములను చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

తగిన చర్యలు తీసుకోవాలని కోరాం: కనకమేడల

ప్రతిపక్ష నేత సభకు రక్షణ కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌  రాజీవ్‌కుమార్‌ను కలిసిన అనంతరం ఆయన‌ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ దాడులకు పాల్పడుతోందని.. తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు చెప్పారు. మద్యం, నగదు పంపిణీ, పోస్టల్‌ బ్యాలెట్ల అక్రమాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా ఎలా జరిగాయో వివరించామని చెప్పారు. ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుపతి ఉప ఎన్నికలో చర్యలు చేపట్టాలని కోరామని.. తీసుకోవాల్సిన చర్యలపై నాలుగు రోజుల్లో పరిశీలకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని రాజీవ్‌కుమార్‌ హామీ ఇచ్చినట్లు కనకమేడల తెలిపారు.

కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఎంపీల భేటీ

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసిన అనంతరం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాతో తెదేపా ఎంపీలు భేటీ అయ్యారు. చంద్రబాబు సభపై రాళ్ల దాడి, వైకాపా అధికార దుర్వినియోగంపై వారు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంపీ రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. సరైన చర్యలు తీసుకోవాలని కేంద్రహోంశాఖను కోరామన్నారు. మాజీ సీఎం అన్ని అనుమతులు తీసుకొని నిర్వహించిన సభపై రాళ్ల దాడి జరిగిందని.. దీనిలో రాష్ట్ర పోలీసుల లోపం స్పష్టంగా తెలుస్తోందన్నారు. చంద్రబాబుకు జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్నా.. అదనపు బలగాలతో రక్షణ కల్పించాలని రామ్మోహన్‌నాయుడు విజ్ఞప్తి చేశారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరామని.. ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపేందుకు అజయ్‌భల్లా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని