close

తాజా వార్తలు

Updated : 26/02/2021 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారు: లోకేశ్‌

తెదేపా పురపాలక ఎన్నికల మేనిఫెస్టో విడుదల

మంగళగిరి: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. ‘పల్లెలు గెలిచాయి ఇప్పుడిక మనవంతు’ పేరుతో 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య పంచుమర్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌, వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతకానితనం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు సంబంధించి పార్లమెంట్‌ కమిటీలో ఎంపీ అవినాష్‌ రెడ్డి సభ్యుడిగా ఉండి కూడా ఎందుకు అడ్డుకోలేదు ? కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలన్నీ అమ్మేస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీ కొట్టాయి. ఏపీలో డబుల్‌ సెంచరీ దాటినా ఆశ్చర్యం లేదు. ఒక్క ఛాన్స్‌ అని చెప్పి రాష్ట్రాన్నే నాశనం చేస్తున్నారు. మరోసారి ఆయనకు అధికారం ఇస్తే కుటుంబాలు ఉండవు. 21 నెలల్లో వైకాపా ప్రభుత్వం ఏమీ చేయలేదు. శాంతియుతమైన కుప్పంలో కిరాయికి మనుషులను తీసుకొచ్చి అరాచకాలు సృష్టించారు. ప్రజలను, అభ్యర్థులను బెదిరించకుండా ఓట్లు అడగగలరా? పింఛన్‌ డబ్బులు రూ.250 పెంచి మోసం చేశారు. మునిగిపోయే భూములకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఏం చూసి ప్రజలకు వైకాపాకు ఓటు వేయాలి’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు.



ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని