తెదేపా సర్పంచి అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతి
close

తాజా వార్తలు

Updated : 02/02/2021 04:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెదేపా సర్పంచి అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతి

జగ్గంపేట: తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలకుంట గ్రామానికి చెందిన తెదేపా సర్పంచి అభ్యర్థి భర్త అనుమానాస్పద  స్థితిలో మృతి చెందారు. గొల్లలకుంట గ్రామానికి చెందిన సబ్బెళ్ల శ్రీనివాస రెడ్డి తన భార్య పుష్పవతితో నిన్న నామినేషన్‌ వేయించారు. నామినేషన్‌ వేసిన అనంతరం శ్రీనివాస్‌రెడ్డిని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. అపహరించిన కాసేపటి తర్వాత కాళ్లు, చేతులూ కట్టేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. అపహరణకు సంబంధించి నిన్న శ్రీనివాసరెడ్డిని విచారించిన పోలీసులు ఇవాళ మరోసారి విచారించారు. అనూహ్యంగా సోమవారం సాయంత్రం గ్రామంలోని ఓ పొలంలో శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు విచారించి వెళ్లిన కొన్ని గంటల్లోనే శ్రీనివాసరెడ్డి మృతిచెందడం స్థానికంగా కలకలం రేగుతోంది.

ఇవీ చదవండి..

ఏపీపై కేంద్రానికి సవతితల్లి ప్రేమ: వైకాపా

తెలంగాణకు ఇచ్చింది శూన్యం: ఉత్తమ్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని