
తాజా వార్తలు
‘‘కొల్లు రవీంద్ర ఎలాంటివారో అందరికీ తెలుసు’’
తెదేపా సీనియర్ నేత దేవినేని
అమరావతి: ‘‘బీసీ నేతగా ఎదుగుతున్నారనే కొల్లు రవీంద్రపై కుట్ర పన్నారు. అగ్నికుల క్షత్రియ నేతను దెబ్బ తీయడానికే కుట్రలు పన్నుతున్నారు’’ తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. కొల్లు రవీంద్ర అరెస్టు గురించి దేవినేని మీడియాతో మాట్లాడారు. మోకా భాస్కర్రావు హత్య కేసుతో రవీంద్రకు సంబంధం లేదని అధికారులే చెప్పారు అని దేవినేని అన్నారు.
కొల్లు రవీంద్ర గోడ దూకి పారిపోయారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడానికి కథలు అల్లుతున్నారు అని దేవినేని అన్నారు. రవీంద్ర ఎలాంటివారో అందరికీ తెలుసు అని దేవినేని చెప్పారు. అచ్చెన్నాయుడు కుటుంబం చేసిన పాపం ఏమిటి అని దేవినేని ప్రశ్నించారు. ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు కుటుంబాలపై కక్ష కట్టారని దేవినేని విమర్శించారు. మరోవైపు కొల్లు రవీంద్రను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనతోపాటు మరో నలుగురు నిందితులనూ తరలించారు.