ఏపీలో నిరుద్యోగం పెరిగింది: యనమల
close

తాజా వార్తలు

Updated : 20/03/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో నిరుద్యోగం పెరిగింది: యనమల

 

అమరావతి: ఏపీలో అధికార పార్టీ వైకాపా రౌడీయిజాన్ని పెంచి పోషిస్తోందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. మాదకద్రవ్యాలతో యవతను పెడదారి పట్టిస్తోందని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వాటాల కోసం బెదిరించి పరిశ్రమలను తరిమేశారు. దందాలతో సామాన్య వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం 24 శాతం పెరిగింది. మానవాభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్‌ 27వ స్థానానికి దిగజారింది. పగలు, ప్రతీకారాలకు స్వస్తి చెప్పి పేదల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెట్టి ఉపాధి కల్పించాలి’’ అని యనమల అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని