అమరావతి పోరాటం చిరస్మరణీయం: యనమల
close

తాజా వార్తలు

Published : 13/12/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమరావతి పోరాటం చిరస్మరణీయం: యనమల

అమరావతి : ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటం చిరస్మరణీయమని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 13 జిల్లాల ప్రయోజనం కోసమే అమరావతి రైతులు, మహిళలు పోరాటం చేస్తున్నారన్నారు. 34 వేల ఎకరాలను రాజధాని కోసం ఇచ్చిన అన్నదాతల త్యాగాలు రాష్ట్ర చరిత్రలో అజరామరమని యనమల కొనియాడారు. అమరావతి పట్ల సీఎం జగన్‌ ప్రభుత్వ దుశ్చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లో వైకాపా దమనకాండను గర్హిస్తున్నామన్నారు. 13 జిల్లాల వెన్నెముకను రాష్ట్రప్రభుత్వం విరిచేస్తోందని మండిపడ్డారు. 
తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని వైకాపా బుగ్గిపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి వచ్చిన 130కి పైగా సంస్థలను తరిమేశారన్నారు. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది యువత ఉపాధి అవకాశాలకు గండికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సీఎం జగన్ మొండి పట్టు పట్టారని దుయ్యబట్టారు. రాజధానుల పేరుతో విశాఖ, కర్నూలు ప్రజలను సీఎం మోసం చేస్తున్నారన్నారు. విశాఖలో వేలాది ఎకరాల భూములపై ఆ పార్టీ నేతలు కన్నేశారని యనమల విమర్శించారు. విశాఖలో పెద్దఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆరోపించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని