విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై విషమిచ్చి హత్య
close

తాజా వార్తలు

Published : 30/01/2021 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై విషమిచ్చి హత్య

కీచక ఉపాధ్యాయుడి అరెస్టు

రాంచి: ఝార్ఖండ్‌లో ఓ కీచక టీచర్‌ అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై విషమిచ్చి హత్య చేసిన ఘటన విస్తుగొలుపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం... పలమౌ జిల్లాలోని పంకికి చెందిన బాలిక జనవరి 26 తేదీన పాఠశాలకు వెళ్లింది. కాగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంభు సింగ్‌ (35) బాలికను ఎవరూలేని తరగతి గదికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం పోలీసులకు తెలియజేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను సైతం హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా అదే రోజు రాత్రి విద్యార్థిని ఇంట్లోకి బలవంతంగా చొరబడి బాలికకు విషపు గోలీలు తినిపించాడు. దీంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తల్లిదండ్రులు తమ కూతురిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతిచెందింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక కుటుంబానికి, ఉపాధ్యాయుడికి మధ్య భూతగాదాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

చచ్చే ముందైనా.. ఏటీఎం పిన్‌ నెంబర్‌ చెప్పు

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని