ఒంగోలులో ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీ: సురేశ్‌
close

తాజా వార్తలు

Published : 27/02/2021 15:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒంగోలులో ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీ: సురేశ్‌

తిరుపతి: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆన్‌లైన్‌ తరగతులకు కావాల్సిన సాంకేతికత అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. వందశాతం విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు వీలుగా సాంకేతికత అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. 8వ తరగతి నుంచి కంప్యూటర్‌ కోడింగ్‌పై తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది 2.20 లక్షల మంది డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రవేశాలు కల్పించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లోనూ ఆన్‌లైన్‌ ప్రవేశాలు కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని