పంత్‌ అర్ధశతకం.. భారత్‌ 329 ఆలౌట్‌
close

తాజా వార్తలు

Updated : 14/02/2021 14:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంత్‌ అర్ధశతకం.. భారత్‌ 329 ఆలౌట్‌

చెన్నై: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం 300/6తో రెండో రోజు ఆట కొనసాగించిన కోహ్లీసేన మరో 29 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ (58; 77 బంతుల్లో 7x4, 3x6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రెండోరోజు రెండో ఓవర్‌లోనే మోయిన్‌ అలీ.. అక్షర్‌ పటేల్‌(5), ఇషాంత్‌(0)ను ఔట్‌ చేసి భారత్‌కు షాకిచ్చాడు. అయితే, కుల్‌దీప్‌(0)తో కాసేపు బ్యాటింగ్‌ చేసిన పంత్‌ బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే 65 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, స్టోన్‌ వేసిన 96వ ఓవర్‌లో కుల్‌దీప్‌, సిరాజ్‌(4) ఔటవ్వడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.

అంతుముందు శనివారం టాస్‌ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకోగా, రోహిత్‌(161), రహానె(67) రాణించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మోయిన్‌ అలీ 4, స్టోన్‌ 3, లీచ్‌ 2, రూట్‌ 1 వికెట్‌ తీశారు.

ఇవీ చదవండి..
డబ్బుంటేనే ఆడిస్తారా?
ఇవి రోహిత్ ‘వాలెంటైన్స్‌’ శతకాలు..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని