close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 11/02/2020 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (10/02/2020)

1. రెడ్‌మీ ల్యాపీ తీసుకొస్తోందా?

స్మార్ట్‌ఫోన్లు, టీవీలు.. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు. రెడ్‌మీ నుంచి వచ్చిన, రాబోతున్న గ్యాడ్జెట్ల వరుస ఇది.  ఫిబ్రవరి 11న మీకో సర్‌ప్రైజ్‌ అంటూ రెడ్‌మీ ఓ ట్వీట్‌ చేసింది. అందులో పెట్టిన వీడియోలో ఏదో గ్యాడ్జెట్‌ కనిపిస్తోంది కానీ.. అదేంటో అర్థం కావడం లేదు. కానీ, టెక్‌ వర్గాలు మాత్రం అది రెడ్‌మీ బుక్‌ ల్యాప్‌టాప్‌ అనే అంటున్నారు. 13 అంగుళాల స్క్రీన్‌ ఉండనున్న ఈ ల్యాపీలో 8 జీబీ ర్యామ్‌ ఇస్తారని సమాచారం.  దీంతోపాటు అదే రోజు రెడ్‌మీ 9ఏ, పవర్‌ బ్యాంకు కూడా లాంచ్‌ చేస్తారని తెలుస్తోంది. 


2. ఈ తొమ్మిది యాప్‌లు మీ మొబైల్‌లో ఉన్నాయా?

గూగుల్‌ ప్లే స్టోర్‌లో మాల్‌వేర్‌ ఉన్న యాప్స్‌ గురించి ఇటీవల తెగ వార్తలు వస్తున్నాయి. అవి మీ మొబైల్‌లో ఉంటే వెంటనే తీసేయండి అంటూ నిపుణులు చెబుతున్నారు. తాజాగా అలాంటివి మరో తొమ్మిది యాప్‌ల జాబితా బయటికొచ్చింది. ఇవి మొబైల్‌లో ఉంటే మీరు హ్యాకర్ల బారిన పడ్డట్టే అని చెబుతున్నారు. అవేంటంటే... 

ఇవి మీ మొబైల్‌లో ఉంటే వెంటనే తీసేయండి మరి. 


3. మైక్రోసాఫ్ట్‌ రెండు స్క్రీన్ల ఫోన్‌

ఫోల్డింగ్‌ మొబైల్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. శాంసంగ్‌, హువావే, మోటొరోలా ఇప్పటికే తీసుకొచ్చాయి. ఈ దారిలో మైక్రోసాఫ్ట్‌ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన హార్డ్‌వేర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దీని గురించి ప్రకటించారు కూడా. దీనిని సర్ఫేస్‌ డుయో అని పిలుస్తున్నారు. ఈ మొబైల్‌కు సంబంధించి ఒక హ్యాండ్స్‌ ఆన్‌ వీడియో ఇప్పుడు బయటికొచ్చింది. స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ రూపొందినట్లు సమాచారం.  త్వరలో లాంచ్‌ అవ్వనున్న ఈ సరికొత్త మొబైల్‌ వీడియో ఇదీ...


4. శాంసంగ్‌ జెడ్‌ ఫ్లిప్‌ వీడియో చూశారా?

శాంసంగ్‌ నుంచి రెండో ఫోల్డింగ్‌ ఫోన్‌ లాంచ్‌కి రంగం సిద్ధమైంది. మంగళవారం ఈ మొబైల్‌ లాంచ్‌ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన యాడ్స్‌ సందడి మొదలైంది. ఈ రోజు జరిగిన ఆస్కార్‌ ఈవెంట్‌ సందర్భంగా ఈ మొబైల్‌కు సంబంధించిన యాడ్‌ టెలికాస్ట్‌ చేశారు. అందులో మొబైల్‌ ఎలా ఉందో మీరే ఈ వీడియోలో చూసేయండి. అన్నట్లు ఈ మొబైల్‌ అంతర్జాతీయ మార్కెట్‌ ధర ₹1,42,000 అని సమాచారం.


5. జీపీఎస్‌ కంటే ఎక్కువగా...

ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) గ్లాసెస్‌ విషయంలో ఫేస్‌బుక్‌ మరో ముందడుగు వేసింది. దీని కోసం లండన్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ స్కేప్‌ టెక్నాలజీని కొనుగోలు చేసింది. వ్యక్తుల లొకేషన్‌ను ట్రాక్‌ చేయడానికి వీలుగా ఈ సంస్థ విజువల్‌ పొజిషనింగ్‌ సర్వీసును సిద్ధం చేసింది. జీపీఎస్‌ కంటే మెరుగ్గా ఇది పని చేస్తుందని సమాచారం. ఇమేజెస్‌ను త్రీడీ మ్యాప్స్‌ను మార్చి ప్రాసెస్‌ చేయడం వల్ల లొకేషన్‌ యాక్యురసీ బాగుంటుందని సంస్థ చెబుతోంది.  ఈ సాంకేతికత ద్వారా ఎఫ్‌బీ ఏఆర్‌ గ్లాసెస్‌ పనితనం మరింత మెరుగ్గా ఉంటుందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. 


6. ఆసుస్‌ జెన్‌ఫోన్‌ 7 ఇలా ఉంటుందా?

మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఆసుస్‌ నుంచి ఓ మొబైల్‌ రాబోతుందని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. జెన్‌ఫోన్‌ 6కి సక్సెసర్‌గా తీసుకొస్తారంటున్న ఈ మొబైల్‌లో సంబంధించిన లుక్‌ అంటూ ఒకటి అంతర్జాలంలో హల్‌చల్‌ చేస్తోంది.  దాని ప్రకారం చూస్తే జెన్‌ఫోన్‌ 7గా పిలుస్తున్న ఈ మొబైల్‌లో పిక్సల్‌ 4 మొబైల్‌ తరహాలో వెనుకవైపు నాలుగు కెమెరాల సెటప్‌ ఉంటుంది. ముందువైపు పంచ్‌హోల్‌లో రెండు కెమెరాలుంటాయని సమాచారం. స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌, 5జీ మోడమ్‌తో దీనిని తీసుకొస్తారట. 


7. ఐక్యూ 3 కీలక వివరాలివిగో...

మన దేశంలో విడుదలయ్యే తొలి 5 జీ ఫోన్‌ ఐక్యూ 3 మొబైల్‌ కీలక స్పెసిఫికేషన్లు బయటికొచ్చాయి. మరికొద్ది రోజుల్లో మన మార్కెట్‌లోకి రానున్న ఈ మొబైల్‌లో 6.44 అంగుళాల డిస్‌ప్లే ఉండబోతోంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతో నాలుగు కెమెరాల సెటప్‌ ఉండనుంది. 20:9 యాస్పెక్ట్‌ రేషియోతో 60 హెడ్జ్‌ ప్యానల్‌ ఉండబోతోంది. 6 జీబీ, 8 జీబీ, 12 జీబీ ర్యామ్‌ వెర్షన్లు వస్తాయి. 128 జీబీ, 256 జీబీ స్టోరేజీ ఆప్షన్స్‌ ఉంటాయి. ఫన్‌ టచ్‌ ఓఎస్‌ ఆధారంగానే ఈ మొబైల్స్‌ పని చేస్తాయి. 


8. గూగుల్‌ చెప్పిందని నదిని దాటబోయాడట

గూగుల్‌ మ్యాప్స్‌ చెప్పిందంటూ ఇటీవల అర్ధరాత్రి ఓ యువకుడు మోస్తరుగా గడ్డ కట్టిన మిసిసిపీ నదిని కాలినడకన దాటబోయాడు. అయితే మధ్యలోనే పడిపోవడంతో స్థానిక భద్రతాధికారులు అతడిని రక్షించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ కుర్రాడు మిసిసీపీ నదికి.. అవతలి ఒడ్డున తన హాస్టల్‌కు వెళ్లడానికి గూగుల్‌ మ్యాప్స్‌లో దారిని వెతుక్కుంటూ వచ్చాడు. నది దగ్గరకు వచ్చేసరికి... మీ గమ్యాన్ని చేరుకోవడానికి నదిని దాటమని చెప్పిందట. దీంతో ఆ కుర్రాడు కాలినడకన నదిని దాటే ప్రయత్నం చేసి ఇబ్బందిపడ్డాడు. అయితే నదిని దాటడానికి గూగుల్‌ మ్యాప్స్‌ అతనిని దగ్గర్లో ఉన్న స్టోన్‌ ఆర్చ్‌ బ్రిడ్జిని వినియోగించమని చెప్తే అతను నదిని దాటమని అర్థం చేసుకున్నాడేమో అనే వాదనలూ వినిపిస్తున్నాయి.  


9. TIP : విండోస్‌లో సజెషన్స్‌ ఆపాలా?

విండోస్‌ 10 ఆధారిత ల్యాప్‌టాప్‌లు, సిస్టమ్స్‌లో కొందరికి సజెషన్స్‌ కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకు మీకు క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌ లాంటి బ్రౌజర్లు వాడుతుంటే... స్టార్ట్‌ బటన్‌ స్క్రీన్‌లో అవెందుకు వాడుతున్నారు మన ఎడ్జ్‌ ఉంది కదా అని చూపిస్తోంది. వర్డ్‌ప్యాడ్‌కి సంబంధించి కూడా ఇలాంటి సూచనలు కొన్ని చేస్తోంది. ఇవి మీకు ఇబ్బందికరంగా ఉంటే ఆపేయొచ్చు. దీనికి చేయాల్సిందల్లా అలా కనిపించే సజెషన్‌/యాడ్‌ మీద రైట్‌ క్లిక్‌ చేసి ‘టర్న్‌ ఆఫ్‌ ఆల్‌ సజెషన్స్‌’ని క్లిక్‌ చేయాలి. అయితే ఈ సజెషన్స్‌ అందరికీ చూపించడం లేదు.


10. 125 ఏళ్ల క్రితం నాటి వీడియో.. భలే మార్చేశారు

చేయాలనే ఆసక్తి, చొరవ ఉండాలనే కానీ... సాంకేతికత నేనున్నా అంటూ ముందుకొస్తుంది అంటుంటారు టెక్‌ నిపుణులు. అలా డెన్నిస్‌ షిరైవ్‌ అనే యూట్యూబర్‌ చేసిన మార్పు ఇప్పుడు సోషల్‌ మీడియలో సందడి చేస్తోంది. 1895 కాలం నాటి ఓ ఫ్రెంచ్‌ డాక్యుమెంటరీలోని సన్నివేశాన్ని  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో 4కె 60 ఎఫ్‌పీఎస్‌ నాణ్యతలోకి పెంచాడు. ఆ రెండు వీడియోలను ఈ దిగువ చూసి.. మీరే చెప్పండి ఏది బాగుందో?

పాత వీడియో...

మార్చిన వీడియో...


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.