రాజకీయ పార్టీ పెట్టడం లేదు: తీన్మార్ మల్లన్న
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజకీయ పార్టీ పెట్టడం లేదు: తీన్మార్ మల్లన్న

ఘట్‌కేసర్‌: త్వరలో జరగనున్న నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో పోటీపై తీన్మార్‌ మల్లన్న స్పష్టత ఇచ్చారు. ఈ ఎన్నికలో తాను పోటీచేయడం లేదని తెలిపారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కాచవాని సింగారంలో నిర్వహించిన సభలో భవిష్యత్‌ కార్యాచరణను ఆయన ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా త్వరలో 6వేల కి.మీ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. తీన్మార్‌ మల్లన్న టీమ్‌ పేరిట రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. ఈ సభకు భారీగా తీన్మార్‌ మల్లన్న అనుచరులు హాజరయ్యారు.

ఇటీవల జరిగిన నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్‌ మల్లన్న రెండోస్థానంలో నిలిచారు. ఓ దశలో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆయన గట్టిపోటీ ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లన్నకు.. ప్రధాన రాజకీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థుల కంటే మెరుగైన స్థాయిలో ఓట్లు వచ్చాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని