close

తాజా వార్తలు

Updated : 02/03/2021 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘హస్తం’తో దోస్తీ బిహార్‌ వరకే: తేజస్వి 

కోల్‌కతా: కాంగ్రెస్‌ పార్టీతో తమ పొత్తు బిహార్‌ వరకే పరిమితమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ స్పష్టంచేశారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ సోమవారం ఆయన కోల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు అంశంపై ఇరువురు నేతలూ చర్చించినట్టు సమాచారం.  అనంతరం తేజస్వి యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో దీదీకి పూర్తి మద్దతు ఇవ్వాలని తన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నిర్ణయించారని తెలిపారు. లెఫ్ట్‌, కాంగ్రెస్‌తో పొత్తు బిహార్‌ వరకే పరిమితమని, బెంగాల్‌లో భాజపాను నిలువరించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మమతా బెనర్జీ వెనుక  ఉంటూ ఆమెను బలపరచడం తమ కర్తవ్యమన్నారు. దీదీని తామెప్పుడూ గౌరవిస్తామని, ఆమె సారథ్యంలోని తృణమూల్‌తో మంచి సంబంధాలు ఉన్నట్టు తెలిపారు. మతతత్వ అజెండాతో అధికారంలోకి వచ్చేందుకు భాజపా కలలు కంటోందని, అది జరగదన్నారు.  బెంగాల్‌లో ఉంటోన్న బిహార్‌ ప్రజలు తెలివిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. భాజపా నేతలంతా తమ పనిని పక్కనబెట్టి బెంగాల్‌ బాట పడుతున్నారని తేజస్వీ యాదవ్‌ ఎద్దేవా చేశారు. మరోవైపు, లాలూ జైలు నుంచి బయటకు వస్తే బిహార్‌ ఎన్నికల్లో గెలవలేమని తెలిసే ఆయన్ను రానీయకుండా చేశారని మమత ఆరోపించారు. బిహార్‌ ఎన్నికల్లో భాజపా మోసాలకు పాల్పడిందన్నారు. తాను, తేజస్వీ పోరాడుతున్నామన్న మమత.. బెంగాల్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను ఎనిమిది విడతలుగా ప్రకటించడంపై మరోసారి విమర్శలు కురిపించారు. ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని