close

తాజా వార్తలు

Updated : 24/11/2020 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణ ఎవరి జాగీరుకాదు:తేజస్వి సూర్య

హైదరాబాద్‌: బంగారు తెలంగాణ చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారని, ఆయన కుటుంబం మాత్రమే బంగారంలా మారిందని భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆరోపించారు. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ... తెలంగాణ ఎవరి జాగీరు కాదన్నారు. యువత బలిదానాల కారణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అయినా.. వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు కోసం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాను ఆదరించాలని కోరారు.

 అంతకు ముందు తేజస్వి సూర్య గన్‌పార్క్‌ను సందర్శించారు. హైదరాబాద్‌ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని